ఓటరు నమోదులో నిర్లక్ష్యం వద్దు
ABN, First Publish Date - 2020-12-30T04:17:57+05:30
ఓటరు నమోదులో నిర్లక్ష్యం వద్దు
రాష్ట్ర పరిశీలకురాలు అనితా రాజేంద్ర
జనగామ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియను పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకురాలు అనితా రాజేంద్ర అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై మంగళవారం జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఓటరు నమోదు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాలన్నారు. జిల్లాలో ఫారం-6 కింద 1876, ఫారం-7 కింద 5640, ఫారం-8 కింద 491, ఫారం-8ఏ కింద 28 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఫారం-6ఏ కింద ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 19 మంది దరఖాస్తు చేసుకోగా 10 దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆమె సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఆర్వో మాలతి, జనగామ ఆర్డీవో మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:17:57+05:30 IST