టాప్-200 పరిశోధకుల్లో..
ABN, First Publish Date - 2020-11-03T08:23:48+05:30
స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ప్రచురించిన టాప్-200 పరిశోధకుల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందిన
హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, అధ్యాపకులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ప్రచురించిన టాప్-200 పరిశోధకుల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందిన ముగ్గు రు ప్రొఫెసర్లు స్థానం సంపాదించారు. ఎల్సీవియర్, సీటెక్ స్ట్రాటజీని అనుసరించి స్టాన్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన జాన్ లోనిడీస్ రూపొందించిన ర్యాంకుల నివేదిక.. సీఎల్‌ఓఎస్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. టాప్-200 పరిశోధకుల జాబితాలో హెచ్‌సీయూ సూపర్ యాన్యుటేషన్ విభాగం హానరరీ ప్రొఫెసర్ ఎంఎన్‌వీ ప్రసాద్ 116వ ర్యాంకు సాధించారు.
ఎన్‌సీఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశ్వినీ నాంగియాకు 124వ ర్యాంకు, హెచ్‌సీయూలోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ డైరెక్టర్ ప్రమోద్.కె.నాయర్‌కు 189వ ర్యాంకు లభించింది. మరో 15 మంది హెచ్‌సీయూ అధ్యాపకులు కూడా టాప్-200లో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లను హెచ్‌సీయూ వీసీ అప్పారావు అభినందించారు.
Updated Date - 2020-11-03T08:23:48+05:30 IST