ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబయన్స్‌లో విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపు

ABN, First Publish Date - 2020-03-27T10:20:52+05:30

తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపుపై ఇదివరకే ఇచ్చిన తుది ఉత్తర్వులు, సప్లిమెంటరీ ఉత్తర్వులను మే 31వ తేదీ దాకా అబయన్స్‌(అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మే 31వ తేదీ దాకా యథాతథాస్థితి

రిలీవ్‌ చేసిన రాష్ట్రాలే వేతనాలివ్వాలి: ధర్మాధికారి

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపుపై ఇదివరకే ఇచ్చిన తుది ఉత్తర్వులు, సప్లిమెంటరీ ఉత్తర్వులను మే 31వ తేదీ దాకా అబయన్స్‌(అమలు కాకుండా నిలుపుదల)లో పెడుతూ జస్టిస్‌ డీఎం ధర్మాధికారి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి.. ఉద్యోగులను రిలీవ్‌ చేసిన రాష్ట్రాలే ఆ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. విద్యుత్‌ ఉద్యోగుల్లో తెలంగాణ 655 మందిని, ఆంధ్రప్రదేశ్‌ 655 మందిని రిలీవ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రిలీవ్‌ చేసిన వారిలో 71 మంది ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, భార్యాభర్తలు, సింగిల్‌ ఉమెన్‌ కేసులకు చెందిన వారు ఉన్నారు.


ధర్మాధికారి ఉత్తర్వుల్లో ఈ 71 మంది ప్రస్తావన లేదు. ఏపీ 584 మందిని, తెలంగాణ 655 మందికి ప్రస్తుత వేతనాలు చెల్లించాలని మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో.. 71 మంది విషయంలో ఏం నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వేతన బకాయిలు, ఉద్యోగుల కేటాయింపుపై మే 31వ తేదీ తర్వాత చర్చించనున్నట్లు జస్టిస్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-27T10:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising