మనుషుల్నే కాదు... మానవత్వాన్నీ చంపేస్తోంది
ABN, First Publish Date - 2020-03-27T10:31:52+05:30
కరోనా భయంతో జనం బెంబేలెత్తున్నారు. పక్కనున్న వారు తుమ్మినా, దగ్గినా తమ చావు కళ్లముందే ఉన్నట్లు వణికిపోతున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో ఓ
కరోనా లక్షణాలున్నాయని యువకుడిపై రాళ్లదాడి
పటాన్‌చె రు రూరల్, మార్చి 26: కరోనా భయంతో జనం బెంబేలెత్తున్నారు. పక్కనున్న వారు తుమ్మినా, దగ్గినా తమ చావు కళ్లముందే ఉన్నట్లు వణికిపోతున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దగ్గుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి కరోనా వచ్చిందేమోనని అనుమానించారు. అతని వల్ల తమకెక్కడ వైరస్ అంటుతుందేమోనన్న భయంతో రాళ్లతో దాడి చేశారు. కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన చంద్రకాంత్‌కు(35) ఈ అమానవీయ పరిస్థితి ఎదురైంది. అతను ప్యాసింజర్ ఆటో నడుపుతూ రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలోకి రాగానే స్పృహ తప్పి పడిపోయాడు. దాడి విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు అతన్ని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో 108కి సమాచారం ఇచ్చారు.
Updated Date - 2020-03-27T10:31:52+05:30 IST