ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బీమాతో భరోసా ఇచ్చిన కేసీఆర్‌- నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-02-22T21:41:00+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రైతు అనుకూల ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రైతు అనుకూల ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి చేయూత కోసం అనేక పథకాలు, విధానాలను కేసీఆర్‌ ప్రవేశపెట్టారని అన్నారు. శనివారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అగ్రిటెక్‌-2020లో మాట్లాడారు. రాష్ట్రంలోని 57లక్షల పై చిలుకు రైతులకు రైతుబంధు కింద ఏడాదికి 10వేల కోట్ల పెట్టుబడి సాయం అందుతోందన్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం గత బడ్జెట్‌లో 12వేల కోట్లు కేటాయించిందన్నారు. తిరిగి ఇవ్వనవసరం లేని పంట పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తుందని తెలిపారు. రైతులకు సామాజిక ఆర్ధిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన రైతు కుటుంబాలకు పది రోజుల్లోనే 5లక్షల నగదు సాయం అందేలా వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. అధిక పురుగల మందుల వాడకం వల్ల తక్కువదిగుబడులు, నకిలీ పురుగు మందులు రైతులకు నష్టం చేకూరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. మెరుగయిన సాంతికేకతను ఉపయోగించుకుని దిగుబడులు పెంచడం, నాణ్యతతో కూడిన ఎరువులు, విత్తనాలు అందజేయడం,పంటకు గిట్టుబాటు ధర అందించడం, రాయితీలు అందించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడం కోసం ఉన్న అవకాశంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు.ఇలాంటి అంశాలపై ఈ సదస్సులో కూలంకషంగా చర్చ జరగాలని అన్నారు. 

Updated Date - 2020-02-22T21:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising