అనుబంధ సంస్థలకు అనుమతివ్వాలి: టీఐఎఫ్
ABN, First Publish Date - 2020-05-09T10:08:29+05:30
పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులు అందిం చే దుకాణాలు తెరవడంతో పాటు అనుబంధ విభాగాలను నడపడానికి అనుమతివ్వాల్సిందిగా పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఐఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టీఐఎఫ్ అధ్యక్షుడు
హైదరాబాద్ మే 8 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులు అందిం చే దుకాణాలు తెరవడంతో పాటు అనుబంధ విభాగాలను నడపడానికి అనుమతివ్వాల్సిందిగా పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఐఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టీఐఎఫ్ అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వం చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల ప్రారంభానికి అనుమతించిందని, అయితే అనుబంధ విభాగాలకు అనుమతులు లేకపోవడంతో తామంతా ఇబ్బంది పడుతున్నామని సుధీర్‌రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌తో గ్రామాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తిరిగి పరిశ్రమల కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరారు.
Updated Date - 2020-05-09T10:08:29+05:30 IST