ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు అడవి పందుల బెడద

ABN, First Publish Date - 2020-10-27T10:33:01+05:30

ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలు అడవి జంతువులకు ఆహారంగా మారడంతో అన్నదాతలు ఆందోళనలు చెందుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-పంటల రక్షణకు పాట్లు -పరిహారం అందించాలని వేడుకోలు


చింతలమానేపల్లి, అక్టోబరు26: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలు అడవి జంతువులకు ఆహారంగా మారడంతో అన్నదాతలు ఆందోళనలు చెందుతున్నారు. చింతలమానేపల్లి మండలంలో పత్తి, వరితోపాటు ఇతర పంటలను  సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పత్తి పంట కాయ దశలో, వరి పంట కోత దశలో ఉండడంతో అటవీ పందులు గుంపులుగా ఏర్పడి ఆవాసం ఏర్పాటు చేసుకొని రాత్రింబవళ్లు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నష్టపోయిన పంటలకు అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు ప్రత్యేక సర్వేలు జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాల్సి ఉండగా ఆ సర్వేలు నివేది కలకే పరిమితమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని గంగాపూర్‌, కోర్సిని, దిందా, గూడెం, ఆడిపెల్లి, కర్జెల్లి తదితర గ్రామాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉండడంతో పందులు గుంపులుగా సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.


అవగాహన లేక దరఖాస్తు చేయని రైతులు

అటవీ పందుల దాడుల్లో పంటలు నష్టపోతే నష్టపరిహారం వస్తుందని మెజార్టీ రైతులకు అవగాహన లేక పోవడంతో ధరఖాస్తులు చేయడం లేదు. క్షేత్ర స్థాయిలో పంట ఎంత మేరకు నష్టపోయిందో సంబంధిత  వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నివేధిక ఆధారంగా తమకు ధరఖాస్తు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నష ్టపరిహారం మంజూరుకు కృషి చేస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనికి కొంత సమయం పడుతున్నా చివరికి నష్టపరిహారం వస్తుందో లేదోనని ప్రజలు వాపోతున్నారు. కష్ట పడి సాగు చేసిన పంటల రక్షణకు రైతులు నిత్యం పాట్లు పడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కాపలాకు వెళ్లడమే కాకుండా పంట రక్షణకు పాత చీరలు కట్టడం, నిప్పు వెలిగించడం, సీసాలలో రాళ్లు వేసి ఓ తాడుకు కట్టడం ద్వారా అవి ఊగితే చప్పుడు వచ్చేలా చేయడంతో జంతువులు బయపడి పరుగెత్తేలా చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. 


నష్టపరిహారం చెల్లించాలి-ఎల్లయ్య,  రైతు గంగాపూర్‌ 

నష్టపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. సంబంధిత అధి కారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని రైతులను ఆదు కోవాలి. ఆరుగాలం కష్టపడి వేసిన పంటలను పందులు నాశనం చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నాం. పంటలను కాపాడుకోవడానికి పాట్లు పడుతున్నాం. 


ఉన్నతాధికారులకు నివేదిస్తాం-రాజేందర్‌, కర్జెల్లి రేంజ్‌ అధికారి

అడవి పందులు పంట లను నాశనం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నష్టపో యిన పంటలను సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికా రులు అంచనా వేసి నివేది కలను తయారు చేస్తారు. దీని ఆధారంగా రైతులు తమకు ధరఖాస్తు చేసుకుంటే పరిహారం అందేలా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. రైతులు కూడా పంటల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలి, పంటల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకోవడం, చేన్లల్లో శబ్ధాలు వచ్చేలా వివిధ వస్తువులను అమర్చడం వంటి చర్యలు చేపడితే పంటలను కాపాడుకునేందుకు వీలుంటుంది. 

Updated Date - 2020-10-27T10:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising