ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-07-02T10:45:14+05:30

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల పాటు వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, జూలై1: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల పాటు వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించనున్నారు.  నిబంధనలు పాటించని ఎడల రూ.5వేలు జరిమానా విధించేలా గ్రామసభలో తీర్మానం చేశారు. దీంతో బుధవారం మండల కేంద్రంలో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి బారులు తీరారు.  


జైనూరు వారసంత రద్దు

జైనూరు: మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వార సంతను    కరోనా నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు జైనూరు మేజర్‌ గ్రామ పంచాయతీ ఈఓ ఉమర్‌ శరీఫ్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంతకు జైనూరు, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, కెరమెరి, ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూరు, తదితర మండలాల నుండి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారన్నారు. దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం వారసంత రద్దుకు ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు.   నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మేస్రాం పార్వతీబాయి లక్ష్మణ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T10:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising