ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూకంలో రైతుల సహాయం తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-11-22T03:29:38+05:30

ధాన్యం తూకంలో హ మాలీల సమస్యలుంటే రైతుల సహాయం తీసుకోవా లని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హొళికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, నవంబరు 21 : ధాన్యం తూకంలో హ మాలీల సమస్యలుంటే రైతుల సహాయం తీసుకోవా లని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గుడిపేట పరిధిలోగల డీసీఎంఎస్‌  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కలెక్టర్‌ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలు ఎక్కువ కురవ డంతో తెగుళ్ళు సోకి ధాన్యం రంగు మారిందని రైతు లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని తూర్పాల పట్టి, ఆర బోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే రైతులు ఎవరైనా ధాన్యాన్ని వారే తూకం వేసుకుంటే అనుమతివ్వాలని, బస్తాలను వెం టనే రైస్‌మిల్లులకు తరలించాలని అధికారులను ఆదే శించారు. డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్‌, సర్పంచ్‌ లగిపెట్టి లక్ష్మిరాజయ్య, కార్యదర్శి హరిత, ఏ.ఈ.ఓ ఫాతిమా, పాల్గొన్నారు. 


గ్రామాభివృద్ధికి సర్పంచ్‌లు పాటుపడాలి 

జన్నారం: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని, అభివృద్ధి కోసం సర్పంచ్‌లు పాటుపడాలని కలె క్టర్‌ భారతి హొళికేరి అన్నారు. శనివారం మహ్మదా బాద్‌లో శ్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ చేశా రు. శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.4 లక్షల విలువ చేసే 10 గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన సర్పంచ్‌ సునర్కరి లక్ష్మణ్‌ను అభినందించారు. 

ప్రతీ గ్రామంలో శ్మశానవాటికలు, డంప్‌యార్డులు పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలని, ప్రతీ సర్పంచ్‌ కీలక బాధ్యులుగా పనిచేయాలన్నారు. గ్రామ ప్రగతిలో భాగంగా ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు.  డీఆర్‌డీఓ శేషాద్రి, డీఎల్‌పీఓ, ఎంపీడీఓ అరుణారాణి, ఎంపీటీసీ కొంతం శంకరయ్య, తహసీల్దార్‌ పుష్పలతతో పాటు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T03:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising