ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

ABN, First Publish Date - 2020-12-29T06:05:52+05:30

దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలో తహసీల్దారా కార్యాలయాల ముందు బీజేపీ ధర్నా నిర్వహించింది.

నిర్మల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు దళితమోర్చా దర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ధర్నాలో బీజేపీ నాయకులు

నిర్మల్‌టౌన్‌, డిసెంబరు 28 : దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలో తహసీల్దారా కార్యాలయాల ముందు బీజేపీ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ పిలుపు మేరకు సోమవారం ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్మల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు సోమవారం దళితమోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్‌ మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులను  మోసం చేసిందన్నారు.  దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి గద్దె ఎక్కిన కేసీఆర్‌, దళితులకు అసైన్డ్‌ భూములను ఇచ్చి గుంజుకోవడం ధరణిపోర్టల్‌లో సాంకేతికంగా లేకపోవడం అన్యాయం అన్నారు. దళిత వ్యతిరేక కేసీఆర్‌ ఇప్పటి కైనా దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని  డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌, కేంద్ర విత్తన పాలక మండలి సభ్యుడు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కమల్‌నయన్‌, జిల్లా కార్యదర్శి గాదె విలాస్‌, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్‌, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్‌, ఆడెపు సుధాకర్‌, అయ్యన్నగారి రాజేందర్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌ : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటి తహసీల్దార్‌ ఫారూక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు టేకుప్రకాష్‌, నాయకులు సంతోష్‌, తోకల భూచ్చన్నయాదవ్‌, ప్రొద్దుటూరి గోపాల్‌రెడ్డి, ఉపేందర్‌, ఇనుములస్వామి, సురేందర్‌, సాయికృష్ణ, నాగ రాజు, రాజశేఖర్‌ తదితరులున్నారు. 

సోన్‌ : దళితులపై రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సోమ వారం తహసీల్దార్‌ లక్ష్మీకి వినతిపత్రం సమర్పించారు. బీజేపీ మండల పార్టీ అధ్య క్షుడు మ్యాక ప్రేమ్‌కుమార్‌, నాయకులు నడుకుడ ముత్యం, మల్లేష్‌, సాయన్న, తది తరులు ఉన్నారు. 

దిలావర్‌పూర్‌ : బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అసైన్డ్‌ భూములను ధరణిలో చేర్చాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు కె.వినోద్‌కుమార్‌, దళితమోర్చా మండల అధ్యక్షుడు మధుకర్‌, బీజేపీ నాయకులు చెల్లసాయి, రాజు తదితరులు పాల్గొన్నారు. 

దస్తూరాబాద్‌ : బీజేపీ మోర్చా మండలాధ్యక్షుడు దొంతమల్ల రాజేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొడిమెల లక్ష్మణ్‌, బీజేవైఎం అధ్యక్షుడు రామగిరి భూమేష్‌, ప్రధాన కార్యదర్శి సురేష్‌, దళిత మోర్చా జిల్లా నాయకులు మన్నే నారాయణ, ఉపాధ్యక్షుడు బూస సాయిబాబా, బీజేవైఎం నిమ్మతోట శివ మరియు నాయకులు మామిడి రాజేష్‌, బుర్ర రవి, తలారి మొగిలి, నూతికట్ల నగేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

భైంసా : తహసీల్‌ కార్యాలయం సోమవారం ఎదుట బీజేపీ దళితమోర్చా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  బీజేపీ భైంసా పట్టణ కమిటీ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే అధ్వర్యంలో తహసీల్‌ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ఇందులో మున్సిపల్‌ కౌన్సిలర్‌ గౌతం పింగ్లే, సాహేబ్‌రావ్‌, తాళ్లోడ్‌ శ్రీనివాస్‌,  విఠల్‌, భూషణ్‌, మల్లేష్‌,  బీజైవైఎం ముథోల్‌ నియోజక వర్గ కన్వీనర్‌ అనిల్‌, స్వచ్ఛభారత్‌ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

కుభీర్‌ : బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నందు, వినయ్‌, సింగారం లక్ష్మణ్‌, తదితరులున్నారు. 

తానూర్‌  : మండల బీజేపీ అధ్యక్షులు కే. విష్ణువర్ధన్‌ ఆధ్వర్యంలో డీప్యూటి తహసీల్దార్‌ లచ్చిరాంకు సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమనాథ్‌, హన్మండ్లు, అనీల్‌, సూర్యకాంత్‌, ప్రసాద్‌, లక్ష్మణ్‌లున్నారు.

 ముథోల్‌ : బీజేపీ జిల్లా కిసాన్‌మోర్చ అధ్యక్షుడు ముత్యంరెడ్డి నాయకత్వంలో సోమవారం స్థానిక తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T06:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising