ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలకరికే.. తొందర వద్దు

ABN, First Publish Date - 2020-06-02T10:41:47+05:30

ఇన్నాళ్లు ఠారె త్తించిన ఎండలతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా వాసులకు కాస్త ఉపశమనం కలిగింది. రెండు రోజులుగా వాతా వరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో చల్లబడిన వాతావరణం

వానాకాల పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు

రికార్డు స్థాయిలో పత్తి పంట సాగు

ఈ యేడు సాధారణ వర్షపాతమే అంటున్న అధికారులు


ఆదిలాబాద్‌, జూన్‌1 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లు ఠారె త్తించిన ఎండలతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా వాసులకు కాస్త ఉపశమనం కలిగింది. రెండు రోజులుగా వాతా వరణం చల్లబడడంతో ఎండల తీవ్రత తగ్గింది. సోమవారం తెల్లవారు జామున అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. అల్పపీడనం ద్రోణి ఏర్పడడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నా యి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుప వనాలు జూన్‌ రెండో వారం నాటికి జిల్లాను తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా సాధారణ వర్షపాతం 1157మి.మీలు కాగా, గతేడు 963 మీ.మీల వర్షపాతం నమోదైంది. ఈ సారి సాధారణ వర్షపాతమే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.


మే రెండో వారం వరకు అకాల వర్షాలు కురిశాయి. కేవలం పక్షం రోజుల్లోనే ఉషో ్ణగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో అధికంగా 46.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ప్రస్తుతం 42డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఏటా జూన్‌ మొదటి వారంలో కురిసే తొలకరి వర్షా లకే పత్తి, సోయా, కంది పంటలను వేస్తారు. అలా కాకుండా నల్లరేగడి భూముల్లో కనీసం 60 నుంచి 75 మి.మీల వర్షపాతం, ఎర్రనేలల్లో 50మి.మీల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలు విత్తు కుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రైతు లు తొలకరికే తొందరపడితే నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఒకటి రెండు భారీ వర్షాలు కురి సిన తర్వాతనే నేలలో సరైన తేమ ఉంటుందని చెబుతున్నారు. దీంతో వేసిన విత్తనాలు కూడా సరిగా మొలకెత్తే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. 


విత్తనాలు, ఎరువులు సిద్ధం..

వానాకాల పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను రైతులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా పండించే పత్తి, సోయా, కంది, జొన్న, మొక్కజొన్న పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులను పూర్తి చేసిన రైతులు పంట చేన్లను చదును చేయడం, చెత్తను ఏరివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో తొలకరి వర్షాలు కురిస్తే విత్తనాలు వేసేందుకు సిద్ధ మవుతున్నారు. కానీ వేడి నేలల్లో పంటలు వేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. తొలకరికే విత్తనాలు వేసిన నీటి వసతి ఉన్న రైతు లు నీటి తడులను అందించాల్సి ఉంటుందని చెబు తున్నారు. జూన్‌ రెండో వారం వరకు విత్తనాలు వేసే స్థాయిలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకుంటే మంచిదంటున్నారు.


పత్తి వైపే పరుగులు..

జిల్లాలో పండించే పంటలలో పంట సాగే అధి కంగా ఉండే అవకాశం ఉంది. ఈ సారి కొత్తగా అమలు చేస్తున్న నియంతృత్వ సాగుతో ప్రభుత్వం పత్తి పంటకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. జిల్లాలో అనువైన నల్లరేగడి నేలలు ఉండడం, గత రెండు మూడేళ్లుగా మద్దతు ధర పెరుగడంతో రైతులు పత్తి పంట సాగుకే ఎక్కువగా మొగ్గు చూపు తున్నారు. అలాగే మార్కెట్‌ వసతి మెరుగుగానే ఉండడంతో పత్తి పంట సాగుకు ఇబ్బందులు ఉండవంటున్నారు. ఈ యేడు జిల్లాలో 1.44లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా నియంత్రిత్వ సాగుతో మరింత పెరిగే అవకాశం ఉందంటు న్నారు.


మార్కెట్‌లోకి రకరకాల బీటీ విత్తనాలు రావడంతో కలుపు నివారణ కూడా సులువుగానే మారుతుందని పేర్కొంటున్నారు. వాణిజ్య పంట అయిన పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో డోకా లేదంటున్నారు. నల్ల రేగడి భూములకు అనువైన పంట కావడంతో రైతులు పత్తిని వేసేందుకే రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - 2020-06-02T10:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising