ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2020-11-28T03:53:55+05:30
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు.
-తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు27: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 మే నెలలో ఉపాధ్యాయ సంఘా లతో జరిగిన చర్చల్లో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. కానీ నేటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే దన్నారు. 2018 తరువాత మళ్లీ బదిలీలు నిర్వహించ లేదని బండి రమేష్ అన్నారు. వెంటనే ఆన్‌లైన్‌లో షెడ్యూల్ విడుదల చేసి బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండిం గ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ చేపట్టి అర్హత గల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, 45 శాతం మఽధ్యంతర భృతి ప్రకటిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌కె ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గోక సమంత్‌రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-28T03:53:55+05:30 IST