ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి

ABN, First Publish Date - 2020-12-19T05:36:29+05:30

గ్రామీణ ప్రాంతాల గిరిజనులందరూ చదువుకుంటే నే గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని ఓఎస్డీ ఎం.రాజేష్‌చంద్ర అన్నారు.

దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఓఎస్డీ రాజేష్‌ చంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, డిసెంబరు 18: గ్రామీణ ప్రాంతాల గిరిజనులందరూ చదువుకుంటే నే గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని ఓఎస్డీ ఎం.రాజేష్‌చంద్ర  అన్నారు. శుక్రవారం మండలంలోని హీరాపూర్‌లో రెండు వందల మంది ఆదివాసీ గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన సందర్భంగా నిర్వహించిన పోలీసులు మీ కోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన అగర్వాల్‌ సమాజ్‌ సహిత ట్రస్ట్‌ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చదువుకునే హక్కు అందరికీ ఉందని,  చదువుతోనే కుటుంబాలతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా మారుమూల గ్రామాల ప్రజలతో పోలీసు శాఖ సత్‌సంబంధాలు కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉదయ్‌ రెడ్డి, సీఐ నరేష్‌కుమార్‌ ట్రస్ట్‌ సభ్యులు రాజేష్‌ అగర్వాల్‌, గోపాల్‌ అగర్వాల్‌, పురుషోత్తం అగర్వాల్‌లు పాల్గొన్నారు. ఉట్నూర్‌ నుంచి జిల్లా కేంద్రానికి వెళ్తూ ఓఎస్డీ రాజేష్‌ చంద్ర ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-12-19T05:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising