ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థినికి సన్మానం

ABN, First Publish Date - 2020-10-30T10:58:00+05:30

పట్టణంలోని ఎస్వీ టెంపుల్‌ ఏరియాకు చెందిన విద్యార్థిని ఖుషి సహాని ఇటీవల వెలువడిన నీట్‌ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించగా గురువారం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిటౌన్‌, అక్టోబరు 29:  పట్టణంలోని ఎస్వీ టెంపుల్‌ ఏరియాకు చెందిన విద్యార్థిని ఖుషి సహాని ఇటీవల వెలువడిన నీట్‌ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించగా గురువారం  తెలంగాణ స్టూడెంట్‌, పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  మంద మర్రి సీఐ మహేష్‌ హాజరై  విద్యార్థినిని సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో చదువుకుని ఇంత మంచి ర్యాంకు సాధించడం గొప్ప విషయమన్నారు.  తండ్రి పానిపూరి అమ్ముతూ ఖుషీసహానిని  చదివించడం అభినందనీ యమన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. ఖుషీసహానికి చదువు కోసం ఆర్ధిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఎస్సై భూమేష్‌, స్వేరోస్‌ నార్త్‌జోన్‌ అధ్యక్షుడు బన్న లక్ష్మణ్‌దాస్‌, స్టూడెంట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గరిక రవీందర్‌, ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్‌ , టీఆర్‌ఎస్‌ నాయకులు జె. రవీందర్‌, బడికెల సంపత్‌, బత్తుల శ్రీనివాస్‌, రాంబాబు, సురేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T10:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising