ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాల రద్దు కాలయాపనపై నిరసన

ABN, First Publish Date - 2020-12-04T06:43:36+05:30

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా కాలయాపన సాగిస్తున్నారని గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఖానాపూర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐకేఎస్‌సీసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా కాలయాపన సాగిస్తున్నారని గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను చర్చలకు పిలిచి బిల్లును వెంటనే రద్దు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు బడా వ్యాపారులకు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్నాయని రైతుల కోసం తీసుకువచ్చిన చట్టాలు కానేకావు అన్నారు. కార్మికులను రోడ్డున పడేసిన బిచ్చగాళ్లను చేసినటువంటి ఇట్టి చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతులకు అనుకూలంగా ఉండే చట్టాలను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూతన్‌ కుమార్‌, రైతు సంఘం కార్యదర్శి విలాస్‌, తిరుపతి, అశోక్‌, సత్యనారాయణ, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం

ఖానాపూర్‌, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధించాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఏఐకేఎంఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య అన్నారు. ఈ మేరకు గురువారం ఖానాపూర్‌లో ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేసేందుకు ప్రత్యేకంగా పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా 250కి పైగా రైతు సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇదివరకే నష్టాల్లో ఉన్న రైతన్నకు కేంద్రం తెచ్చిన చట్టాలు మరింత నష్టం చేస్తే తప్పా ఎటువంటి లాభం లేదన్నారు. తక్షణమే రైతు పండించిన పంటకు మద్ధతు ధర లభించేలా గ్యారెంటీ చట్టాన్ని రూపొందించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జరిగే పరిణామాలు తీవ్రం గా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ జిల్లా నాయకులు ఉపాలి, రాజేశ్వర్‌, శంకర్‌, జక్కుల రాజన్న, వర్మ, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-04T06:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising