ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-04T06:35:07+05:30

వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌టౌన్‌, డిసెంబరు 3 : వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వరి సేకరణ కమిటీ సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వానా కాలం 2020-21 సంవత్సరానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోళ్లను వేగ వంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం జిల్లాలో ఒక లక్షా యాభై రెండు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంద ని తెలిపారు. డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, జీసీసీ, హాకా ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్రాలలో నిర్వాహకులు నాణ్య తా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 157 కేంద్రాల ద్వారా 7404 రైతుల నుండి 31681 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొను గోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 3710 మంది రైతులు 30 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోళ్ల వివరాలను ప్రతిరోజు ట్యాబ్‌లలో నమోదు చేయాలని సూచించారు. అవసరమైన గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయని, లారీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు తలెత్తకుండా కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్‌ నుంచి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తామని తెలిపారు. రైస్‌మిల్లర్లు, లారీ యాజమాన్యాలు, అధికారులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఈ సమావేశంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సహకార శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌, ఏపీడీ గోవిందరావు, ఇతర శాఖల అధికారులు, రైస్‌ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T06:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising