ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN, First Publish Date - 2020-12-15T06:26:38+05:30
ఓటరు నమోదు ప్రక్రియను సిబ్బంది వేగవంతం చేయాలని ఓటరు నమోదు రాష్ట్ర పరిశీలకులు యోగితారాణా అన్నారు.
ఓటరు నమోదు రాష్ట్ర పరిశీలకులు యోగితారాణా
సోన్, డిసెంబరు 14 : ఓటరు నమోదు ప్రక్రియను సిబ్బంది వేగవంతం చేయాలని ఓటరు నమోదు రాష్ట్ర పరిశీలకులు యోగితారాణా అన్నారు. సోమ వారం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా తప్పక నమోదు చేసుకోవాలన్నారు. నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో నమోదు ప్రక్రియ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిం చకుండా తప్పులు చేకుండా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి కిషన్, తహసీల్దార్ లక్ష్మీ, ఎస్సై ఆసీఫ్, ఆర్‌ఐ సోహెల్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T06:26:38+05:30 IST