ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట కల్లాల నిర్మాణాలను వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-15T06:36:49+05:30

పంటకల్లాల నిర్మాణాలను వేగవంతం చేయా లని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధి కారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

నిర్మల్‌, డిసెంబరు (ఆంధ్రజ్యోతి) 14 : పంటకల్లాల నిర్మాణాలను వేగవంతం చేయా లని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధి కారులను ఆదేశించారు. సోమవారం సాయం త్రం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పంట కల్లాల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేయా లని ఆదేశించారు. ప్రభుత్వం జిల్లాకు 2527 కల్లాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటి వరకు 1600 పనులను ప్రారంభించామన్నారు. సంబంధిత శాఖల అధి కారులు నిర్మాణాల పురోగతిని ప్రతీరోజు పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.  ఈ నిర్మాణ పనులలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీ డీవోలు, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖల అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising