ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు

ABN, First Publish Date - 2020-06-01T09:31:50+05:30

మండలంలోని రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఆదివారం మండలంలోని కాప్రీ గ్రామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, మే 31: మండలంలోని రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఆదివారం మండలంలోని కాప్రీ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉమ్రిలో ఎస్‌డీఎఫ్‌ నిధుల ద్వారా రూ.10లక్షల వ్యయంతో నిర్మించే ఫార్మేషన్‌ రోడ్డుకు అధికారులు, నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. 


అభివృద్ధి వైపే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బోరజ్‌ 44వ జాతీయ రహదారి నుంచి గిమ్మా వరకు పూర్తిగా చెడిపోయిన డీఎంఎప్‌టీ నిధులైన రూ.3కోట్ల 6 2లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఆయన అధికారులు, నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.


దీంతో పాటు జైనథ్‌ మండలం లేఖర్‌వాడ సీసీ రోడ్లు, మురికి కాల్వల ద్వారా ఎస్‌డీఎఫ్‌ నిధులైన రూ.10లక్షల వ్యయంతో ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతో పాటు మండలంలోని కాప్రీ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉమ్రి గ్రామంలో నిర్మించే సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మాణం చేసే విధంగా ఉమ్రి గ్రామాన్ని ఎస్‌డీఎఫ్‌ కింద రూ.5లక్షలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో జైనథ్‌ జడ్పీటీసీ తుమ్మల అరుందతి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ మాశెట్టి గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T09:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising