ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ సంస్థల కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-10-03T10:34:28+05:30

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తూ రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవసాయ బిల్లును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిసాన్‌ మజ్దూర్‌ బచావో దివస్‌లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య


ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 2: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తూ రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవసాయ బిల్లును తీసుకు వచ్చిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకుడు సిరిసిల్ల రాజయ్య ఆరోపించారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన కిసాన్‌ మజ్దూర్‌ బచావో దివస్‌కు ఆయన ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు వ్యవసాయదారుల నడ్డి విరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆదాని, అంబానీ లాంటి వాళ్లు పెద్ద మొత్తంలో వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసి పండిన పంటను నిలువ చేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు రైతులకు కనీస మద్దతు ధర ఉండేదని, ఈ బిల్లు ద్వారా పంటకు కనీస మద్దతు ధర అనేది ఉండదని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమం గురించి తెలియని బీజేపీ ప్రభుత్వం మతాల పేరుతో చిచ్చు పెడుతూ దేశభక్తి గురించి మాట్లాడడం దారుణమని అన్నారు. 


డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలో పూర్తి కాకుండా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి అడ నుంచి జగన్నాథ్‌పూర్‌, వట్టి వాగు ఇలా అన్ని ప్రాజెక్లులు తిరిగే కార్యక్రమం తీసుకొస్తున్నామని అన్నారు.  సిర్పూర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ మోడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు పూర్వకాలంలో గ్రీకు దేశంలో అమలు చేసిన డ్రకోనియన్‌లా కనిపిస్తుందన్నారు. కమతాల ఏకీకరణ పేరుతో సన్న కారు, చిన్నకారు రైతులను దెబ్బతీసే విధంగా ఈ చట్టం ఉదందని తెలిపారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దళిత యువతి అత్యాచార ఘటనను ఖండిస్తూ అంబేద్కర్‌ చౌక్‌ వద్దకు ర్యాలీగా వెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రితీష్‌రాథోడ్‌, రాజేంద్రకుమార్‌, వెంకన్న, వసంత్‌ రావు, ఆసీఫ్‌, నిజాం, మురళీ, కుసుమరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T10:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising