ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్వత్రిక సమ్మె సక్సెస్‌

ABN, First Publish Date - 2020-11-27T04:07:31+05:30

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా గురువారం చేపట్టిన సార్వ త్రిక సమ్మె విజయవంతమైంది.

మంచిర్యాల బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోసిపోయిన బొగ్గు గనులు

సమ్మెలో పాల్గొన్న బ్యాంకర్లు

విధులను బహిష్కరించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు

మందమర్రిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

మంచిర్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా గురువారం చేపట్టిన సార్వ త్రిక సమ్మె విజయవంతమైంది. వివిధ రంగాలకు చెందిన సం ఘటిత, అసంఘటిత కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొ న్నారు. విమానాశ్రయాలు, భారత్‌ పెట్రోలియం, ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, డిఫెన్స్‌, తదితర ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరంచేసే కుట్రలకు నిరసనగా కార్మిక లోకం కదిలి వచ్చింది.  వివిధ సంఘాల నేతృత్వంలో నాయకులు, కార్మికులు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపె ట్టిన మూడు వ్యవసాయ సంస్కరణ ఆర్డినెన్సులపైనా రైతు సంఘాలు నిరసన గళం ఎత్తాయి. వ్యవసాయ బిల్లులను తక్ష ణమే రద్దు చేసి, వాటి స్థానంలో గిట్టుబాటు ధరలు పెంచేలా బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 


హోరెత్తిన నిరసనలు...

కార్మికుల గైర్హాజరుతో బొగ్గు గనులన్నీ బోసిపోయాయి. సిం గరేణి పరిధిలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా ల్లో టీబీజీకేఎస్‌ నాయకులు గనుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టగా ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో మందమ ర్రి ఏరియాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అత్యవసర కార్మికులు తప్ప మూడు షిఫ్టుల్లో ఇతరులెవరూ విధులకు హాజరుకాలేదు. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండ గనుల వద్ద పోలీసులు బం దోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా కేంద్రంలో విధులు బహిష్కరిం చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యాంకు, ఎల్‌ఐసీ ఉద్యోగులు సమ్మెకు మద్దతుగా విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రంలో సమ్మె కారణంగా పలు వ్యాపార సంస్థలను మూసి ఉంచారు. వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా నుంచి బస్టాండ్‌ వరకు ఊరేగింపు, నిరసన ప్రదర్శన లు చేపట్టారు. పంటలకు మద్దతు ధర చెల్లించేలా చట్టం తేవా లని ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2020-11-27T04:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising