పల్లెప్రగతిపై సమీక్ష సమావేశం
ABN, First Publish Date - 2020-08-22T11:09:10+05:30
పల్లెప్రగతి ద్వారా గ్రామాల అభి వృద్ధిని మాట్లాల్లో కాదు పనుల్లో చేసి చూపెట్టాలని డీపీవో నారాయణరావు అన్నారు
దండేపల్లి, ఆగస్టు 21: పల్లెప్రగతి ద్వారా గ్రామాల అభి వృద్ధిని మాట్లాల్లో కాదు పనుల్లో చేసి చూపెట్టాలని డీపీవో నారాయణరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల కార్యదర్శులతో పల్లె ప్రగతి, వివిధ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహిం చారు. ముందుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నారాయణ రావుకు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, సిబ్బంది పుష్పగుచ్ఛం అం దజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, ఇంకుడుగుంతల నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఎల్‌పీవో ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవోలు చంద్రమౌళి, అజ్మిత్ ఆలీ, ఏపీవో దుర్గదాస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-08-22T11:09:10+05:30 IST