ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడెంలో రెడ్‌ జోన్‌ ప్రకటించిన అధికారులు

ABN, First Publish Date - 2020-04-10T11:16:17+05:30

నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో కరోనా కలకలం రేపింది. కడెంకు చెందిన వ్యక్తికి కరోనా కోవిడ్‌ పాజిటివ్‌ తేలడంతో కడెంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడెం, ఏప్రిల్‌ 9 : నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో కరోనా కలకలం రేపింది. కడెంకు చెందిన వ్యక్తికి కరోనా కోవిడ్‌ పాజిటివ్‌ తేలడంతో కడెంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తి నిర్మల్‌ చాక్‌పెల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఇంటి నుండి రాకపోకలు సాగిస్తాడు. ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆయన సతీమణి, ఆయన మిత్రుడిని టెస్టుల కోసం నిర్మల్‌ క్వారంటైన్‌కు తరలించారు. కాలనీలో దాదాపు 12 మందిని హౌస్‌ క్వారంటైన్‌లో పెట్టారు. కడెంలో కరోనా పాజిటివ్‌ తేలడంతో మండలంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడే రాకపోకలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


రెడ్‌జోన్‌గా కల్లూర్‌

కుంటాల : నర్సాపూర్‌(జి) మండలంలోని చాక్‌పెల్లి గ్రామంలో ఇదివరకే కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదు కావడంతో, అధికారులు అప్రమత్తమై  పక్కనే ఉన్న కల్లూర్‌ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.


స్వీయ నియంత్రణలోకి వెళ్తున్న లక్ష్మణచాంద గ్రామాలు

లక్ష్మణచాంద: మండలంలోని గ్రామాలన్ని స్వీయ నియంత్రణలోకి వెళ్ళాయి. మండల కేంద్రమైన లక్ష్మణచాంద సర్పంచ్‌ ముత్యంరెడ్డి 24 గంటల పాటు ఎవరూ బయటకు రావద్దని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో గ్రామస్థులెవరూ రోడ్ల మీదకు రాలేదు. 

Updated Date - 2020-04-10T11:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising