ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల మధ్య కుదిరిన సయోధ్య

ABN, First Publish Date - 2020-12-31T04:36:02+05:30

తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన మత్స్యకారుల మధ్య బుధవారం సయోధ్య కుదిరింది.

మత్స్యకారులతో మాట్లాడుతున్న అహిరి అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ గుప్తా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జూరు, డిసెంబరు30: తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన మత్స్యకారుల మధ్య బుధవారం సయోధ్య కుదిరింది. మహా రాష్ట్రలోని దేవలమర్రి, తెలంగాణలోని తలా యి గ్రామాలకు చెందిన మత్స్యకారులు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాణహిత నదిలో చేపల వేట విషయమై ఇటీవల  వివాదం నెలకొంది. దీంతో బుధవారం మహా రాష్ట్రలోని అహిరి అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ గుప్తా ప్రాణహిత నది వద్ద ఇరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులతో సమా వేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు విడతల వారీగా రోజు కొకరు ప్రాణహితలో చేపలు పట్టుకు నేందుకు ఒప్పందం ఏర్పర్చుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన మత్స్యకారులు ప్రాణహిత నదిలో తామంటే తామే చేపలు పట్టుకుంటామనడంతో వివాదం మొదలైంది. దీంతో ఇరు ప్రాంతా లకు మత్స్యకారులతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడి సయోధ్య కుదిర్చారు. ప్రాణహిత నదిలో శాశ్వతంగా ఏర్పాటు చేసే వనరులను ఇరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కూడా సమానంగా శాశ్వత వలలను ఏర్పాటు చేసి విడతల వారీగా పట్టుకుకోవాలని సూచించారు. దీనికి ఇరు ప్రాంతాల మత్స్య కారులు అంగీకరించడంతో వివాదం సద్దుమ ణిగింది. ఈ కార్యక్రమంలో అహిరి డీఎస్పీ భజరంగ్‌ దేశాయ్‌, సీఐ ప్రవీణ్‌డాంగే, తహసీ ల్దార్‌ ఓంకార్‌ ఉడాన్‌, బెజ్జూరు తహసీల్దార్‌ రవీందర్‌, ఎస్సై సాగర్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising