ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే

ABN, First Publish Date - 2020-11-26T05:40:04+05:30

గత 36 ఏళ్లుగా ప్రతీ యేడాది ఖానాపూర్‌లో కన్నుల పండువగా సాగే వెంకన్న బ్రహ్మోత్సవాలను ఈ యేడు నిర్వహించే సమ యం అసన్నమైంది.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి ఖానాపూర్‌లో కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు

36వ బ్రహ్మోత్సవాలకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ముస్తాబు

ఈ నెల 27న కల్యాణోత్సవము, 30న జాతర

ఖానాపూర్‌, నవంబరు 25 : గత 36 ఏళ్లుగా ప్రతీ యేడాది ఖానాపూర్‌లో కన్నుల పండువగా సాగే వెంకన్న బ్రహ్మోత్సవాలను ఈ యేడు నిర్వహించే సమ యం అసన్నమైంది. నేటి నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు ఆరురోజుల పాటు అంగరంగ వైభవంగాస్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమయ్యింది. ఖానాపూర్‌ మండలమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాల నుండి భక్తులు ప్రతీయేడు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుని స్వామి వారి కల్యాణమహోత్సవాన్ని కను లారా వీక్షించి వెళ్తారు. ఈ యేడు కరోనా నేపథ్యంలో ఆలయాన్ని వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయకమిటీ, భక్త బృందం సభ్యులు చెబుతున్నారు. 

నేటి నుండి ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు

పట్టణంలోని పద్మావతినగర్‌లో గల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ 36వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నేటి నుండి ఆరురోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యజ్ఞాచార్యులు చక్రపాణి వాసుదేవా చార్యులు పర్యవేక్షణలో వేదపండితులు చక్రపాణి నరసింహమూర్తి, నిమ్మగడ్డ సందీప్‌శర్మల ఆద్వర్యంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 26వ తేదిన అంకురారోపణం, కులదేవత స్థాపనం, 27న స్వామివారి కల్యాణమహోత్సవం, అన్నదానం, 28న సామూహిక కుంకు మార్చన, 29వ తేదీన సుదర్శనయాగం, 30వ తేదీన ఆకాశదీపోత్సవం, రథోత్స వము (జాతర), డిసెంబర్‌ 1వ తేదీన పూర్ణాహుతి సాయంత్రం నాగవెళ్ళి, వసంతో త్సవము, ఏకాంతసేవ తదితర కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు ఆలయకమిటీ పేర్కొంది. 

Updated Date - 2020-11-26T05:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising