ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణలో అంతా బోగసేల

ABN, First Publish Date - 2020-04-10T11:17:44+05:30

ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో పేర్లు నమోదు అయిన వ్యక్తులకే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు వర్తిస్తాయని నిబంధనలు ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగా సమగ్ర సర్వేలో పేర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాష్ట్ర  ప్రజల పేరిట రేషన్‌, పింఛన్‌, ఓటరుకార్డులు

లబోదిబోమంటున్న అర్హులైన లబ్ధిదారులు

మంత్రి అల్లోలకు గ్రామస్థుల ఫిర్యాదు


సారంగాపూర్‌, ఏప్రిల్‌ 9 : ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో పేర్లు నమోదు అయిన వ్యక్తులకే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు వర్తిస్తాయని నిబంధనలు ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగా  సమగ్ర సర్వేలో పేర్లు నమోదు కాని వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంజూరు చేయడంలో సారంగాపూర్‌ మండలంలో స్వర్ణలో అంతా బోగస్‌ అనడానికి స్వర్ణ గ్రామమే నిదర్శనం. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలో స్వర్ణ గ్రామం మహరాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో మహరాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని అప్పారావ్‌పేట్‌ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు స్వర్ణ గ్రామంలో నివాసం ఉంటున్నట్లు ఓటర్‌ జాబితాలో పేర్లను నమోదు చేసుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌తో పాటు రేషన్‌ బియ్యంను పొందుతూ పింఛన్‌ డబ్బులను గత కొన్ని నెలల నుండి తీసుకుంటున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.


దీంతో గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు రాకపోవడంతో సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారుల వద్ద పేర్కొనడంతో పాటు గ్రామంలోని యువకులు పింఛన్‌ , రేషన్‌, ఓటర్‌ జాబితాలను పరిశీలించగా మహరాష్ట్రకు చెందిన వ్యక్తులు ఈ సంక్షేమ పథకాలను పొందుతున్నట్లు తెలియడంతో గ్రామస్థులు వెళ్లి మంత్రి అల్లోలకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో గురువారం అధికారులు గ్రామస్థులతో అక్రమంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులందరినీ గుర్తించి వాటికి సహకరించినటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా సంక్షేమ పథకాలను తీసుకుంటున్న పేర్లను తొలగింపజేస్తామని గ్రామస్థులతో తెలిపినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-10T11:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising