ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి కొనుగోళ్లు చేయాలని రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2020-12-29T04:09:41+05:30

జైపూర్‌, చెన్నూర్‌ మండలాల్లో పత్తి రైతులు సోమవారం రాస్తారోకో చేశారు. ఇందారంలోని బాలాజీ జిన్నింగ్‌ మిల్లుకు సుమారు వెయ్యి క్వింటాళ్ళ పలు గ్రామాల రైతులు వాహనాల్లో తరలించారు.

రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేస్తున్న పత్తి రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌/చెన్నూర్‌, డిసెంబరు28: జైపూర్‌, చెన్నూర్‌ మండలాల్లో పత్తి రైతులు సోమవారం రాస్తారోకో చేశారు. ఇందారంలోని బాలాజీ జిన్నింగ్‌ మిల్లుకు సుమారు వెయ్యి క్వింటాళ్ళ పలు గ్రామాల రైతులు వాహనాల్లో తరలించారు. సీసీఐ నుంచి రోజుకు 500 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నాయని, అంతే కొనుగోలు చేస్తామని మిల్లు యజమాని తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వ కుండ కొనుగోలు నిలిపివేయడంపై రైతులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. రవాణా ఖర్చులతోపాటు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నామని, మిల్లుకు వచ్చిన మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని రాజీవ్‌ రహ దారిపై వాహనాలను అడ్డుపెట్టి బైఠాయించారు. విషయం తెలుసుకొన్న శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌, ఎస్సై రామకృష్ణలు రైతులకు నచ్చజెప్పారు. మిల్లు యజమానితో మాట్లాడి సోమవారం మిల్లుకు వచ్చిన పత్తిని కొనుగోళ్లు చేయాలని ఒప్పించడంతో రాస్తారోకోను విరమించారు. మంగళవారం కొను గోలు నిలిపివేస్తున్నామని, అధికారులతో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని మిల్లు యజమాని తెలిపారు.  

చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట సమీపంలో ని ఆదిశంకర జిన్నింగ్‌ మిల్లు ఎదుట రైతులు రాస్తా రోకో చేశారు. ముందస్తు సమాచారం లేకుండా సీసీ ఐ కొనుగోళ్లను నిలిపివేయడంతో రోడ్డుపై బైఠాయిం చి నిరసన తెలిపారు. గ్రామాల నుంచి పత్తిని తీసు కువస్తే కొనుగోళ్లు నిలిపివేయడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు.పోలీసులు అక్కడకు చేరు కొని రైతులను సముదాయించారు. ఫోన్‌లో  అధికా రులను సంప్రదించగా మంగళవారం నుంచి కొనుగో ళ్లు చేపడతామని చెప్పడంతో రైతులు శాంతించారు. 

Updated Date - 2020-12-29T04:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising