ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

ABN, First Publish Date - 2020-11-29T06:30:25+05:30

నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు.

ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్‌తో డాక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, నవంబరు 28 : నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన గురువమ్మ అనే మహిళ తొంటి కీళ్లనొప్పితో బాధపడుతోంది. హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహరాష్ట్రలోని నాందేడ్‌లోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో సంప్రదిస్తే శస్త్రచికిత్సకు రూ.4 లక్షలు ఖర్చవు తుందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చికిత్సకు ముందు కు రాలేదు. సదరు మహిళ కూతురు భైంసా ప్రాంతీయ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. అక్కడి ఆస్పత్రి వైద్యుల సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌రెడ్డిని సంప్రదించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎముకల చికిత్స నిపుణుడు రఘునందన్‌రెడ్డి, అరుణ్‌రెడ్డిలు మహిళకు తొంటి కీళ్లమార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేస్తారు. వైద్యుల సలహాలు, సూచనల మేరకు సదరు మహిళా పూర్తిగా కోలుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన చికిత్సలు ఉచితంగా అందించడం పట్ల వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దేవేందర్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ కృష్ణలు అన్నారు. 

Updated Date - 2020-11-29T06:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising