ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-04T04:15:26+05:30

రైతులపై నిర్బంధకాండను కేంద్ర ప్రభు త్వం ఆపాలని, రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేసి వారితో చర్చలు జర పాలని సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 3: రైతులపై నిర్బంధకాండను కేంద్ర ప్రభు త్వం ఆపాలని, రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేసి వారితో చర్చలు జర పాలని సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఢిల్లీ లో శాంతియుత నిరసన తెలుపుతుండగా బారికేడ్లు, జలఫిరంగులు, భాష్ప వాయువులతో నిర్బంధించడం బాధాకరమన్నారు. రైతు ఐక్యత దెబ్బతీసి, ఉద్య మాన్ని అణచివేసే ఎత్తుగడలను ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్నారని, దేశా నికి అన్నం పెట్టే రైతాంగంపై నిర్బంధం కొనసాగిస్తే మూల్యం చెల్లించక తప్పద న్నారు. రత్నం తిరుపతి, బ్రహ్మానందం, తిరుపతి, జ్యోతి,  పాల్గొన్నారు. 

ఫ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు సంకె రవి పేర్కొన్నారు. గురువారం రైతు పోరాటంపై మోదీ ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని, దానికి నిరసనగా సీపీఎం అను బంధ సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రవి మాట్లాడుతూ రైతాంగం కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా వ్యవసాయ సవరణ చట్టాలు చేస్తూ రైతులను అభాసుపాలు చేస్తోం దని విమర్శించారు. అన్నదాతలపై జలఫిరంగులు, లాఠీలు ఝుళిపించడం, రైతు ఉద్యమంపై దాడులు చేయడం శోచనీయమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి  గోవర్థన్‌, సీఐటీయూ జిల్లాఅధ్యక్షురాలు రాజేశ్వరి, ఝాన్సీ, నిరంజన్‌ పాల్గొన్నారు.


మందమర్రిటౌన్‌ :  కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని  గురువారం జయశంకర్‌ చౌరస్తా వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ దేశభక్తి పేరిట దేశాన్ని దేశ ద్రోహులకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. శ్రీనివా స్‌, బానేష్‌, రాజేష్‌, రాజం, ఐలయ్య, రమేష్‌, తిరుపతి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T04:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising