సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు సిద్ధంకండి
ABN, First Publish Date - 2020-11-13T10:31:52+05:30
గౌడ కులస్తులు తమ సమస్యలను పరిష్కరించు కునేందుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ వర్కిం గ్ చైర్మన్ అమరవేని నర్సాగౌడ్ అన్నారు. గురువారం పీఆర్‌టీయూ భవన్‌లో గౌడ హక్కుల పోరాట
రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ వర్కింగ్ చైర్మన్ నర్సాగౌడ్
జన్నారం, నవంబరు 12: గౌడ కులస్తులు తమ సమస్యలను పరిష్కరించు కునేందుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ వర్కిం గ్ చైర్మన్ అమరవేని నర్సాగౌడ్ అన్నారు. గురువారం పీఆర్‌టీయూ భవన్‌లో గౌడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీల కు అతీతంగా ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అన్ని కులాల అభివృద్ధికి నిధులు ఇచ్చి గౌడ కులస్తులకు కేటాయించకపోవ డం శోచనీయమన్నారు. గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 కోట్ల నిధులను ఏర్పాటు చేయాలని, గీతా కార్మిక కార్మికునికి ద్విచక్రవాహనాలు అందజేయాలని, ఏజెన్సీలో ఉన్న కార్మికులకు పింఛను సౌకర్యం కల్పించాలన్నారు. మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తిరుపతి గౌడ్, నర్సాగౌడ్, లక్ష్మణ్ గౌడ్, సత్యా గౌడ్, ఎరుకల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T10:31:52+05:30 IST