ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జాక్టో’ నాయకుల ముందస్తు అరెస్టు అన్యాయం

ABN, First Publish Date - 2020-12-29T05:30:00+05:30

రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు, బది లీలు చేపట్టాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నా చేపట్టేందుకు వెళ్తున్న జాక్టో నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయమని జాక్టో, యూఎస్‌పీఎస్‌సీ నాయకులు అన్నారు.

పోలీసు స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 29: రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు, బది లీలు చేపట్టాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నా చేపట్టేందుకు వెళ్తున్న జాక్టో నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయమని జాక్టో, యూఎస్‌పీఎస్‌సీ నాయకులు అన్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తూ జాక్టో ఉపాధ్యాయులు వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం జాక్టో జిల్లా సభ్యులు సురేఖ, మహేందర్‌ మాట్లా డుతూ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కల్పిం చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపిం చారు. ఇప్పటికే పలుమార్లు నిరసనల ద్వారా ప్రభుత్వానికి విన్నవించినా ఇంత వరకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల పదోన్నతుల, బదిలీ ప్రక్రియను అంతర్‌ జిల్లాల బదిలీలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఉట్నూర్‌రూరల్‌: జాక్టో, యూఎస్‌పీసీ ఆఽధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో తలపెట్టిన ధర్నాకు వెళ్లకుండా ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. టీటీఎఫ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ గణేష్‌, ప్రధాన కార్యదర్శి జాదవ్‌ రవీందర్‌, జాదవ్‌ మధుకర్‌, విజయ్‌లను సోమవారం రాత్రి అరెస్టు చేసి మంగళవారం ఉదయం స్వంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా రాథోడ్‌ గణేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించకుండా వేధింపుచర్యలకు పూనుకుంటుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising