ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీలతో కలిసిపోతున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-11-29T06:10:44+05:30

సంఘ విద్రోహుల బాట పట్టకుండా ప్రభుత్వ అధికారులు అందించే చేయూతను ఉపయోగించుకొని ముందడుగు వేయాలంటూ పోలీసులు ఆదివాసీలతో కలిసి పోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, నవంబరు 28: సంఘ విద్రోహుల బాట పట్టకుండా ప్రభుత్వ అధికారులు అందించే చేయూతను ఉపయోగించుకొని ముందడుగు వేయాలంటూ పోలీసులు ఆదివాసీలతో కలిసి పోతున్నారు. పోలీసులు మీకోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ఎళ్లవేళల తాము ఉన్నామంటూ ఆదివాసీలకు భరోసా ఇస్తున్నారు. శనివారం ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని శాంతాపూర్‌ గిరిజనుకు చలికాలం లో చలి నుంచి కాపాడుకోవడానికి దుప్పట్లు పంపిణీ చేశారు. అతేకాకుం డా దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌ నేతృత్వంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి గిరిజనుల కు వైద్య సేవలు అందించేలా కృషి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మా ట్లాడుతూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రా మీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను తమ వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడడంతో పాటు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సైతం సద్వినియోగం చేసుకోవాల ని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని యువకుల్లో స్నేహభావం పెంపొందించడానికే గిరిజన గ్రామాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామ ని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కోవ అనురాధ, సీఐ నరే్‌షకుమార్‌, ఎస్సై సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T06:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising