ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో దుకాణంలో ప్లాస్టిక్‌ బియ్యం

ABN, First Publish Date - 2020-12-14T03:40:39+05:30

వేంపల్లి గ్రామంలో రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ కనిపించడంతో అప్రమత్తమైన సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ గోపాల్‌ ఆదివారం పలు రేషన్‌ దుకాణాలను తనిఖీ చేశారు.

హాజీపూర్‌ మండలం వేంపల్లి రేషన్‌షాపులో బియ్యాన్ని పరిశీలిస్తున్న సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, డిసెంబరు 13: వేంపల్లి గ్రామంలో రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ కనిపించడంతో అప్రమత్తమైన సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ గోపాల్‌ ఆదివారం పలు రేషన్‌ దుకాణాలను తనిఖీ చేశారు.  తహసీల్దార్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సిబ్బందితో కలిసి వేంపల్లి గ్రామంలో డీలర్‌ జి.కిరణ్‌కుమార్‌ దుకాణం లో తనిఖీ నిర్వహించారు. ఈషాపులో ఎస్‌ఆర్‌ఎం సబ్బెపల్లి నుంచి వచ్చిన బియ్యంలో 10 నుంచి 20 ప్లాస్టిక్‌ గింజలు లభించినట్లు పేర్కొన్నారు. ఈ దుకాణంలో పూర్తి కోటా 130.10 క్వింటాళ్ళు కాగా అందులో నుంచి 47.73 క్వింటాళ్ళ బియ్యం పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు. దుకాణంలో ఉన్న 25 బ్యాగులను పరిశీలించారు. దొరికిన ప్లాస్టిక్‌ గింజలను సీజ్‌ చేసి తీసుకోవడం జరిగిందన్నారు. చౌకధరల దుకాణాన్ని మూసివేసి పై అధికారుల  ఆదేశాలను అనుసరించి పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేపడతామని అధికారులు పేర్కొ న్నారు. తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ విజయ, ఆర్‌ఐ హర్షన్‌కుమార్‌, సర్పంచ్‌ శారద రమేష్‌, ఎంపీటీసీ డేగ బాపు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T03:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising