ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

ABN, First Publish Date - 2020-07-03T10:50:59+05:30

విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను వారం రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతిహోళికేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, జూలై 2 : విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను వారం రోజులలో పూర్తి చేయాలని  కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. గురువారం తాళ్లపేట, రాజు గూడ, నాగసముద్రం గ్రామాల్లో ఆమె పర్యటించారు.    వైకుంఠధామం నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండ టంపై అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశా రు. పది రోజుల్లో పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ హెచ్చరించారు. రాజుగూడ శివారులోని  పల్లె ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించారు. పారిశుధ్యం లోపించకుం డా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాల న్నారు. రోడ్డుపై చెత్తాచెదారం వేయవద్దన్నారు.


పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి వైపునకు నడిపిం చే విధంగా సర్పంచులు, నాయకులు కృషి చేయాల న్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్‌ సంతో ష్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, సర్పంచులు లచ్చుపటే ల్‌, కళావతి, అనవేని ప్రేమల, ఆర్‌ఐ భానుచందర్‌, ఎంపివో చంద్రమౌళి పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి 

వేమనపల్లి : పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పను లను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నీల్వాయిలో పూర్తయిన డంపింగ్‌ యార్డును ఆమె ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ మండలంలో మొదటగా నీల్వాయిలో డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తయ్యిందన్నారు. మిగతా గ్రామాలు నీల్వాయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.


అన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, ఇంకుడుగుంతలు, కంపోస్టు షెడ్‌ల నిర్మాణాలను త్వర గా పూర్తి చేయాలని పేర్కొన్నారు. డంపింగ్‌యార్డు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేసిన సర్పంచు గాలి మధు, ఎంపీటీసీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు.  జడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్‌డీవో పీడీ శేషాద్రి, డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో అనిల్‌కుమార్‌, కార్యదర్శి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-03T10:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising