ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పశువులకు నట్టల నివారణ మందులను వేయించాలి’

ABN, First Publish Date - 2020-12-02T05:08:51+05:30

పశువుల యజమానులు తమ పశువులకు నట్ట ల నివారణ మందులను వేయించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ పారూఖీ అన్నారు.

గుండంపల్లిలో గొర్రెలకు నట్టల నివారణ మందు వేస్తున్న ఎంపీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌ (జి), డిసెంబర్‌ 1: పశువుల యజమానులు తమ పశువులకు నట్ట ల నివారణ మందులను వేయించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ పారూఖీ అన్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్‌ గ్రామంలో నట్టల నివారణ మందును కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పశు య జమానులు తప్పకుండా నట్టల నివారణ మందులను వేయించాలన్నారు. అనంతరం నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి వై.రమేష్‌ కుమార్‌, జడ్పీటీసీ ఆర్గుమీది రామయ్య, సర్పంచ్‌ గోవింద్‌ రెడ్డి, ఎంపీటీసీ రవి, ఎంపీడీవో వనజ, తహసీల్దార్‌ కిరణ్మయి, మండల పశువైద్యాధికారి గోవర్దన్‌ తదితరులున్నారు.

నిర్మల్‌ రూరల్‌: పాడి పశువులకు ప్రభుత్వం నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నిర్మల్‌ మండలంలోని ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం నట్టల నివారణ మందులను పంపిణీ చేయటం జరిగింది. మూగజీవాలకు ప్రభుత్వం నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో సర్పంచ్‌ సునంద రాములు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సోన్‌: మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును ఎంపీపీ బర్ల మానస మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణ ప్రసాద్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ వినోద్‌, ఎంపీటీసీలు లింగన్న, వనజలు, పశువైద్యాధికారి మహేష్‌, తదితరులు ఉన్నారు.

పెంబి: పశువులకు నట్టల నివారణ మందు తప్పనిసరిగా వేయించాలని పశువైద్యాధికారి విజయ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నాగపూర్‌ గ్రామంలో నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రైతు పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత శ్రీనివాస్‌, పశువైద్య సిబ్బంది ఉన్నారు.

దిలావర్‌పూర్‌: మండలంలోని గుండంపల్లిలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందును ఉచితంగా వేసే కార్యక్రామన్ని మంగళవారం ఎంపీపీ ఎలాల అమృత రెడ్డి, జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి ప్రారంభించారు. వారం రోజుల పాటు గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందును వేయనున్నట్లు మండల పశువైద్యాధికారి డా.నందకుమార్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వీడీసీ సభ్యులు, రైతులు, గొర్రెల, మేకల పెంపకందారులు పాల్గొన్నారు.

కుభీర్‌: మండలంలోని పార్డి(బి) గ్రామంలో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్ట నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ తూం లక్ష్మీబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందుల ను వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్యక్రమాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తూం పుష్పలత, రైతు సమితి అధ్యక్షులు పుప్పాల పీరాజీ, పశువైద్య సిబ్బంది, తదితరులున్నారు.

లోకేశ్వరం: మండల కేంద్రం మంగళవారం గొర్రెలకు, మేకలకు నట్ట నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డా.రమేశ్‌కుమార్‌ పాల్గొని గొర్రెలకు, మేకలకు మందులను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాడి పరిశ్రమ వలన రైతులు లబ్ధిచెందుతారన్నారు. ఇందులో సర్పంచ్‌ సౌజన్య కపీల్‌, ఆర్‌ఏడీ సురేష్‌, బీఎస్‌ డా.జెస్సీ, రాజేశ్వర్‌, వీఏ మండల వెటర్నరీ సిబ్బంది, గొర్రెల పెంపకందారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising