ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యతతోనే హక్కుల సాధన

ABN, First Publish Date - 2020-10-30T10:55:03+05:30

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఐక్యతగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆసి ఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్షా భూమిలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, అక్టోబరు29: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఐక్యతగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆసి ఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్షా భూమిలో గురువారం అంబే ద్కర్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 64వ దమ్మ చక్రపరి వర్తన దినోత్సవ కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈసందర్భంగా గౌతమ బుద్ధుడి విగ్రహానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ బుద్ధుడు చూపిన మార్గాన్ని ఆచరించారన్నారు. అంబేద్కర్‌ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజును దమ్మచక్ర పరివర్తన దినంగా జరుపుకుంటున్నారన్నారు.


విద్యతోనే అభివృద్ధి సాధ్య మని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యలో రాణించే విధంగా కృషి చేయా లన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అంబేద్కర్‌ భవనం ప్రహరీ, ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ సెంట్రల్‌ కమిటీ అధ్యక్షుడు అశోక్‌ మౌల్కర్‌, లుంబినీ దీక్షా భూమి అధ్యక్షుడు తిరుపతి, స్వేరోస్‌ నార్త్‌ జోన్‌ అధ్యక్షుడు హేమంత్‌ షిండె, ఆయా సంఘాల నాయ కులు ప్రభాకర్‌, మధు, సంజీవ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2020-10-30T10:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising