ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-01T07:55:40+05:30

బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డులకు మిషన్‌ భగీరథ నీరు అందిస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను ప్రారంభించి మాట్లాడారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, అక్టోబరు 31 : బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డులకు మిషన్‌ భగీరథ నీరు అందిస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను ప్రారంభించి మాట్లాడారు. రూ. 32 కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ పనులను పట్టణంలో చేపడుతున్నామని, 140 కిలోమీటర్ల మేర పైపులైన్‌లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగునీరందిస్తా మని పేర్కొన్నారు. కన్నాల శివారులో వాటర్‌ ట్యాంకును ఏర్పాటు చేసి  నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో ప్రజలు తాగునీటి సమ స్య ఎదుర్కొంటున్నారని, మిషన్‌ భగీరథతో సమస్య పరిష్కారం కానుంద న్నారు. డీఈ శ్రీనివాస్‌, ఏఈ అనిల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింగం, కౌన్సిలర్లు అప్సర్‌,  కృష్ణ, రాములు,  నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T07:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising