సమస్యల పరిష్కారం కోసమే సమావేశం : ఎంపీపీ
ABN, First Publish Date - 2020-12-31T05:17:37+05:30
గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల అధ్యక్షురాలు జాదవ్ కల్పన అన్నారు.
భైంసా రూరల్, డిసెంబరు 30: గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల అధ్యక్షురాలు జాదవ్ కల్పన అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లా డారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, డ్రైనేజీ వ్యవస్థ ఎన్నో సమస్యలు ఉంటాయని ఆ సమస్యను సమావేశం లో చర్చించి గ్రామాభివృద్ధికి పాటు పడేందుకు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఈ సమావేశం ఉంటుందని అన్నారు. మొదటగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గోపాల కృష్ణారెడ్డి సర్వసభ్య సమా వేశ ఎజెండాను చదివి వినిపించారు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికను సభలో వినిపించారు. ఈ సభలో ఇరవై శాఖలపై చర్చించారు. పలువురు సర్పంచ్ లు తమ గ్రామాలలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ట్రాన్స్‌కో ఏవో అజీమ్ దృష్టికి తెచ్చారు. ఆయన సమాధానం ఇస్తూ మండలంలో కొనసాగడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని అన్నారు. అనం తరం మహగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్‌పీవో అబ్దుల్ సలీమ్ మాట్లా డుతూ కరోనా వ్యాధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రతీరోజు టెస్ట్ చేస్తున్నామని తెలిపారు. అనునిత్యం ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది గ్రామగ్రామాన తిరుగుతూ కరోనా వ్యాధి గురించి అవగాహన కలిగిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కొత్త కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా కష్ట కాలంలో కూడా వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమించారు అని ఆయన అన్నారు. గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని ఇరిగేషన్ లీకేజీలు ఉన్నాయని అధికారి చంద్ర శేఖర్ నిలదీశారు. త్వరలో అన్ని గ్రామాలకు సవ్యంగా మిషన్ భగీరథ నీరు అందిస్తామని ఆ శాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. కరోనా ఉండటం వల్ల చాలామంది సభ్యులు హాజరు కాలేదు. సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. అన్ని శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా సభ్యులు తక్కువ రావడంతో సభా ముందుగానే ముగిసిం ది. ఈ సర్వసభ్య సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు గాజుల శంకర్, నూతనంగా ఎన్నికైన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ, ఎంపీడీవో గోపాల కృష్ణారెడ్డి, కోఆప్షన్ మెంబర్ గజానంద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన పిప్పర కృష్ణ
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన పిప్పర కృష్ణను మండల అధ్యక్షురా లు జాదవ్ కల్పన, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సన్మానించారు.
Updated Date - 2020-12-31T05:17:37+05:30 IST