ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు చర్యలు

ABN, First Publish Date - 2020-09-14T10:27:32+05:30

జిల్లాలో కరోనా నియంత్ర ణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్‌,చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 13: జిల్లాలో కరోనా నియంత్ర ణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్‌,చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో జల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,లతో కలిసి కొవిడ్‌ 19 నియంత్రణ పై అధికారులతో సమీక్షా సమేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకూ జిల్లాలో 34,773 మందికి  కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులకు మెరుగైన చికిత్సతో పాటు బలమైన పోషకాహారం అందిస్తున్నా మని తెలిపారు. ఐసోలేషన్‌ కేంద్రాలలో మౌలిక వసతుల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు బెడ్లు, అవసరమయ్యే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


ప్రభుత్వం నుంచి మందులు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహిచాలన్నారు. ఆంబులెన్స్‌, ఆక్సిజన్‌, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏఎన్‌ఎంల ద్వారా మెడికల్‌ కిట్ల పంపిణీ జరుగాలన్నారు. ఆర్కెపీ, మందమర్రి, చెన్నూర్‌ తదితర ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమయ్యే రక్త నిధులను సేకరించాలని సూచించారు. ఐసోలేషన్‌ కేంద్రాలలో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఉపాధిహామీ పనుల లభ్యత, పని కల్పించేం దుకు అన్ని మండలాల అబివృద్ధి అధికారులతో ససమావేశం ఏర్పాటు చేయనున్నామని బాల్క సుమన్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నీరజ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌, జిల్లా సర్వేయలైన్స్‌ అధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-14T10:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising