మట్కా స్థావరాలపై దాడులు
ABN, First Publish Date - 2020-12-12T04:54:54+05:30
ఆదిలాబాద్ పట్ట ణంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న మట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు.
ఇద్దరు నిర్వాహకుల అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్, డిసెంబరు11: ఆదిలాబాద్ పట్ట ణంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న మట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. ముందుగా టూ టౌన్ పోలీసు స్టేష న్ పరిధిలో బస్టాండ్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో రెండో పట్టణ ఎస్సై కె.విష్ణు ప్రకాష్‌తో కలిసి మట్కా నిర్వాహకున్ని అరెస్టు చేశారు. పిట్టలవాడకు చెందిన మట్కా నిర్వాహకుడు అజీజ్ అహ్మద్‌ఖాన్ నుంచి రూ.4300 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో సమాచారం మేరకు మావల పోలీసు స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో ఎస్సై డి. రమేష్‌తో కలిసి మట్కా నిర్వాహ కుడు భుక్తాపూర్ కాలానికి చెందిన అత్తుఖాన్ అరెస్టు చేసి అతని నుంచి రూ.500 నగదు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మట్కా జూదానికి పాల్పడుతున్న ఇరువురిపై కేసులు నమోదు చేశామని ఎస్సైలు తెలి పారు. ఇందులో టాస్క్‌ఫోర్స్ పోలీ సు సిబ్బంది తాజోద్దిన్, రమేష్ కుమార్, మంగల్‌సింగ్, సయ్యద్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-12-12T04:54:54+05:30 IST