ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుకారాం సేవలు చిరస్మరణీయం

ABN, First Publish Date - 2020-11-30T05:55:37+05:30

తుకారాం సేవలు చిరస్మరణీయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, నవంబరు 29: గోండుల్లో తొలి ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించి జిల్లా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన మడావి తుకారాం సేవలు చిరస్మరణీయమని ఆదివాసీ గిరిజనులు అన్నారు. ఆదివారం మడావి తుకారాం 22వ వర్ధంతి పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు. మండలంలోని ఎక్స్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి ఐటీడీఏ ఏపీవో(జనరల్‌) కనక భీంరావుతోపాటు గిరిజన సంఘాలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా కనక భీంరావు మాట్లాడుతూ జిల్లా గిరిజనులు తుకారాంను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాల వైపు పయణించాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, రాయిసెంటర్‌ జిల్లా సర్‌మెండి మెస్రం దుర్గు, ఏటీడబ్లూఏసీ మాజీ చైర్మన్‌ కనక లక్కెరావు, మెస్రం మనోహర్‌,  ఆదివాసీ తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి  పుర్కబాపూరావు, పుష్పరాణీ, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌, ఏవీఎస్‌పీ, ఆదివాసీ కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మడావి తుకారం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం మడావి తుకారం చేసిన సేవలను కొనియాడారు. ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికా రులు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని హైకోర్టులో ఉన్న కేసుల నిమిత్తం వాటిని చర్చించడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేస్రం గంగారాం పిలుపు నిచ్చారు. ఇందులో నాయకులు కోరెంగ సుంగు, కొడప జ్యోతిరాం, సోయం పరశురాం, గేడం శ్రీరాం, మనోహార్‌, నాగేశ్వర్‌, ఏవీఎస్‌పీ నాయకులు నైతం బాలు, కుమ్రశ్రీనివాస్‌, సెడ్మకి భీంరావు తదితరులున్నారు. 

బోథ్‌రూరల్‌: మండలంలోని పార్డి(బి) గ్రామంలో కొమరం భీం స్థలం వద్ద ఆదివారం ఐఏఎస్‌ అధికారి మడావి తుకారం 22వ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్‌ అధికారిగా ఐటీడీఏ పీవోగా ఆదివాసీల సంక్షేమం కోసం పాటు పడ్డారని కొనియాడారు. ఇందులో ఎంపీటీసీ శంబు, సర్పంచ్‌ కొవకిషన్‌, ఆత్రంశంకర్‌, ఆత్రం గంగాధర్‌, లాలురాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising