విద్యార్థి ప్రాణం తీసిన ఆన్‌లైన్ రమ్మీ
ABN, First Publish Date - 2020-12-29T13:03:38+05:30
ఆన్ లైన్ రమ్మీ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. అభిలాష్(25) అనే సీఏ విద్యార్థి డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడాడు.
మంచిర్యాల: ఆన్ లైన్ రమ్మీ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. అభిలాష్(25) అనే సీఏ విద్యార్థి డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడాడు. డబ్బుల కోసం అప్పులు చేసి అవి కట్టలేక మనస్తాపానికి గురయ్యాడు. చివరకు పీకల్లోతుల్లో అప్పులో కూరుకుపోయిన అభిలాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-12-29T13:03:38+05:30 IST