ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావి తరాలకు పచ్చదనం అందించాలి

ABN, First Publish Date - 2020-07-08T10:41:01+05:30

భావి తరాలకు పచ్చదనం అందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌ యాదవ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌ యాదవ్‌


ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై7: భావి తరాలకు పచ్చదనం అందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం చిర్రకుంట, ఎల్లారం గ్రామాల్లో హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతవారణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అనంతరం గ్రామస్థులకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఆలాగే రైతు వేదికకు 8 గుంటలు, ప్రకృతి వనం కోసం భూమిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రవిందర్‌, ఎంపీడీఓ రమేష్‌కుమార్‌, ఎంపీఓ కోట ప్రసాద్‌, ఏపీఓ చంద్రశేఖర్‌, ఎంసీ భరత్‌, ఎంపీటీసీ శంకరన్‌, సర్పంచులు పార్వతి, బాపురావు తదితరులు పాల్గొన్నారు. 


చింతలమానేపల్లి, జూలై7: రోగులకు వైద్య సేవలను అందిస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ డుబ్బుల నానయ్య అన్నారు. మండలంలోని బాబాపూర్‌ (రవీంద్రనగర్‌) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రజలు రోగాల భారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్‌ విద్యావతిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. 


ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఆవరణలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, వైద్యురాలు విద్యావతి, సిబ్బందితో కలిసి పండ్ల, పూల మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి రక్షణకు ప్రత్యేక కృషి ఆయన చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 


కెరమెరి, జూలై 7: ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఎంపీపీ మోతిరాం అన్నారు. మంగళవారం మండలంలోని ధనోర గ్రామంలో హరితహారం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని  పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ద్రుపదబాయి, సర్పంచ్‌ చిలుక, ఎంపీటీసీ సకారం, ఆదర్శరైతు బాలాజీ, ఉప సర్పంచ్‌ రిజ్వాన్‌, నాయకులు కేశవ్‌, భరత్‌భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T10:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising