ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ

ABN, First Publish Date - 2020-12-29T06:11:03+05:30

తెలంగాణలో ఆలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మహర్దశ వచ్చిందని, అనేక నూతన ఆలయాలను నిర్మించామని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

శివకోటి మందిర ప్రతిష్ఠాపన ఉత్సవంలో మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగదాంబ సేవాలాల్‌ ఆలయం విగ్రహ ప్రతిష్ఠాపనలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మామడ, డిసెంబరు 28 : తెలంగాణలో ఆలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మహర్దశ వచ్చిందని, అనేక నూతన ఆలయాలను నిర్మించామని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం రోజున మండలంలోని మామడ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన జగదాంబమాత, సేవాలాల్‌ నూతన ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మాట్లాడుతూ నిర్మల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500 ఆలయాలను నిర్మించుకున్నామని, ఒక మామడ మండలంలోనే వందకు పైగా ఆలయాలను నిర్మించామని తెలి పారు. బంజారా కులస్తుల కోసం ప్రతి తండాలలో సేవాలాల్‌ జగదాంబ మందిరాలను నిర్మిస్తున్నామని, త్వరలో రెండు తండాలను కలిపి గ్రామ పంచాయతీ చేస్తామని అన్నారు. అనంతరం మామడ మండల కేంద్రంలో భీమన్న ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ రాంకిషన్‌ రెడ్డి, సర్పంచ్‌ హన్మగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కన్వీనర్‌ పాకాల చంద్రశేఖర్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు హలీం, నాయకులు అశోక్‌, మేక రఘు, గబ్బర్‌ సింగ్‌, తారచంద్‌, అధికారులు రవికిషన్‌, రామారావు, తదితరులు పాల్గొన్నారు. 

సారంగాపూర్‌ : ఆలయ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని న్యాయ, పర్యా వరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జౌళిలో ఇటీవలే రూ. 20 లక్షలతో నిర్మించిన నరసింహస్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి ఆయన హాజరై ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి మాట్లాడారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇవ్వడం జరిగిందని అదనంగా రూ. 10 లక్షలను మంజూరు చేస్తున్నట్లు తెలి పారు. జిల్లాలో ఆలయాలకు నిధులను మంజూరు చేయడంతో పాటు ఆల య అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. స్వర్ణప్రాజెక్టు మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేయించి మరమ్మతుల పనులు చేయడంతో ప్రా జెక్టు ఆయకట్టు క్రింద భూములకు రెండు పంటలకు సాగు నీరందుతుంద న్నారు. అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, రాంకిషన్‌రెడ్డి, రైతు సమన్వయ జిల్లా కో - ఆర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ నారాయణ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మీ మధుకర్‌రెడ్డి, ఎంపీటీసీ భోజారెడ్డిలతో పాటు నాయకులు రాజ్‌ మహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్‌, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. 

నిర్మల్‌ కల్చరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌ జిల్లా కేంద్రం బుధవార్‌పేట్‌లో నూతనంగా పునర్మించిన శివకోటి మందిర ప్రతిష్టాపన ఉత్సవంలో పాల్గొన్నారు. శివకోటి మందిరానికి రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వ హిస్తున్నారన్నారు. ప్రజలు భక్తి భావన పెంపొందించుకుని ఆధ్యాత్మిక చింతన అలవర్చు కోవాలన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేయాలని సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణా ధ్యక్షుడు మారుగొండ రాము, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మీ, కౌన్సిలర్‌ నేరెళ్ళ వేణు, లక్కిడి జగన్మోహన్‌ రెడ్డి, ధర్మాజీగారి రాజేందర్‌, స్థానికులు పాల్గొన్నారు. ప్రహరీ గోడ నిర్మా ణానికి మరో 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 


Updated Date - 2020-12-29T06:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising