ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2020-06-04T09:44:11+05:30

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా


కౌటాల, జూన్‌3: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం కౌటాల మండలంలోని గురుడుపేట గ్రామాన్ని సందర్శిం చారు. మొదట స్మశాన వాటిక, డంపింగ్‌ యార్డును సందర్శించి గ్రామ కార్యదర్శి, సర్పంచులకు సూచనలు చేశారు. ప్రధాన రోడ్ల గుండా తిరుగుతున్నప్పుడు విద్యుత్‌లైట్లు వెలుగుతుండడంతో అధికారులను మందలించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతలు నిర్మించు కునేలా చూడాలన్నారు.  అనంతరం గ్రామంలో అందరికి రేషన్‌ కార్డులు ఉన్నాయా, పెన్షన్లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీని పరిశీలించారు.  ఆయన వెంట  అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌, డీపీఓ రమేష్‌, డీఎల్‌పీఓ, ఎంపీపీ విశ్వనాథ్‌, జడ్పీటీసీ అనూష, ఎంపీడీఓ ప్రభు, ఏపీఓ పూర్ణిమా, ఏపీఎం మోహన్‌లాల్‌, ఎంపీఓ సాయి కృష్ణ ఉన్నారు. 


కౌటాల(సిర్పూర్‌-టి): సిర్పూర్‌(టి) మండలంలోని టోంకిని, లక్ష్మిపూర్‌, వెంకట్రావుపేటలో గ్రామాల్లో అదనపు కలెక్టర్‌ రాంబాబు, సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో మండల ప్రత్యేకాధికారి, డీడబ్ల్యూఓ సావిత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్ర పర్చాలని, మురికి నీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. వారి వెంట ఎంపీపీ సువర్ణ, ఎంపీఓ మహేందర్‌, ఈఓ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 


కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులో మాట్లాడారు. శానిటైజేషన్‌ పనులపై పూర్తిగా శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ప్రయాణీకుడికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రయాణికుడికి తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు పూర్తి డేటాను  తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ డీఎ భౌమిక్‌, తహసిల్దార్‌ ప్రమోద్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T09:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising