ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్‌గంగా తీరంలో ఘనంగా కార్తీక పూజలు

ABN, First Publish Date - 2020-11-29T06:16:37+05:30

మండలంలోని వడూర్‌ చినర్ల సరిహద్దులోని పెన్‌గంగా నది తీరంలో గత రెండు రోజులుగా భక్తులు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెన్‌గంగా నదిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీంపూర్‌, నవంబరు 28: మండలంలోని వడూర్‌ చినర్ల సరిహద్దులోని పెన్‌గంగా నది తీరంలో గత రెండు రోజులుగా భక్తులు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో రోజు శనివారం పూజల్లో భాగంగా శబరిమాత ఉపసాకులు స్వామి శివానంద భారతి నేతృత్వంలో ఉదయం హోం, పూర్ణహుతి, అనంతరం చక్రస్నానాలు నిర్వహించారు. అర్లి(టి), ధనరా, అంతర్గాం, గోమూత్రి, కరంజి, ఆదిలాబాద్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు వందల సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, సర్పంచ్‌లు హనుమాన్‌ దాస్‌యాదవ్‌, గొల్లి రమబాయి లస్మన్న, ఉప సర్పంచ్‌వెంకటస్వామి, ఎంపీటీసీలు భోజన్నయాదవ్‌, స్వప్న రాకేష్‌, గ్రామ పెద్దలు చిల్కూరి సంజీవ్‌రెడ్డి, అనిల్‌యాదవ్‌, కావటి దేవరెడ్డియాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising