ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 వేల కుటుంబాలకు ఐటీడీఏ చేయూత

ABN, First Publish Date - 2020-05-23T10:18:34+05:30

ఉమ్మడి జిల్లాలోని కొలాం, తోటి గిరిజనులకు చెందిన ఎనిమిది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, మే 22: ఉమ్మడి జిల్లాలోని కొలాం, తోటి గిరిజనులకు చెందిన ఎనిమిది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా తెలిపారు. శుక్రవారం మండలంలోని  ఎందా రాముగూడలో కొలాం గిరిజనులకు చెందిన 60 కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా నిత్యావసర సరుకులను ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఐటీడీఏ,  స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొలాం తోటి గిరిజనులకు సరుకులను అందిస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మిగిలిపోయిన ఆహార వస్తువులను సైతం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సీసీడీపీ నిధులను మంజూరు చేసిన వెంటనే గిరిజన గ్రామాల్లో  మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.


రానున్న వర్షాకాలంలో  కూడా ప్రజలందరు కరోనా వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌ అన్నారు. ఈ  కార్యక్రమంలో  డీడీ చందనసర్పే, ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ, సర్పంచ్‌ సురేఖ, గ్రామ పటేల్‌ శేషారావు, అజిమొద్దీన్‌, సింగారేభరత్‌, దాసండ్ల ప్రభాకర్‌, జూవ్వాద్‌ అన్సారీ, ధరణీ రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T10:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising