ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికిల్‌సెల్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు

ABN, First Publish Date - 2020-12-03T05:18:54+05:30

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిష్టినా జడ్‌ చోంగ్తూ ఆదేశాల మేరకు తలసేమియా, సికిల్‌ సెల్‌, ఎనిమియా సొసైటీ తని ఖీ బృందం బుధవారం ఉట్నూర్‌లోని సీహెచ్‌సీని సందర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, డిసెంబరు 2: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిష్టినా జడ్‌ చోంగ్తూ ఆదేశాల మేరకు తలసేమియా, సికిల్‌ సెల్‌, ఎనిమియా సొసైటీ తని ఖీ బృందం బుధవారం ఉట్నూర్‌లోని సీహెచ్‌సీని సందర్శించింది. వైద్య ఆరో గ్య శాఖ సెక్రెటరీ డాక్టర్‌ సుమన్‌జైన్‌ ఆధ్వర్యంలో బృందం సభ్యులు డాక్టర్‌ పద్మ, రత్నవళి, రవితో పాటు కమిషనరేట్‌ ఏపీవో డేవిడ్‌లు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో ప్రబలుతున్న తలసేమియ, సికిల్‌సెల్‌, ఎనిమియాను అదుపు చేయడానికి అవసరమైన పరీక్షలను ఇక నుంచి ఉట్నూర్‌ సీహెచ్‌సీలో ఏర్పాటు చేయుటకు కావాల్సిన సౌకర్యాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. సీహెచ్‌సీలో పరీక్షల కోసం రెండు ప్రత్యేక గదులను పరిశీలించడంతో పాటు సిబ్బంది, పరికారాలు, బ్లడ్‌బ్యాంక్‌ అందుబాటులో ఉన్నాయా? లేదా? కావాల్సిన సిబ్బంది, వారికి శిక్షణలు, వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. అవసరమైతే ఆస్పత్రిలో రక్త సేకరణ శిభిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎడీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది శ్రీనివాస్‌, కేశవ్‌, ప్రభాకర్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T05:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising