ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటరీగా ఐఏఎస్‌ వి. శేషాద్రి నియామకం

ABN, First Publish Date - 2020-10-01T00:12:55+05:30

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్‌ వి. శేషాద్రి నియమితులయ్యారు. వి.శేషాద్రి 1999 బ్యాచ్‌కు చెందిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్‌ వి. శేషాద్రి నియమితులయ్యారు. వి.శేషాద్రి 1999 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసులో, అందులోనూ ప్రధాన మంత్రి కార్యాలయ బాధ్యతల్లో ఉన్న ఆయన తాజాగా అక్కడ సర్వీసులు పూర్తిచేసుకొని.. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. ఆయన వచ్చీరాగానే ప్రభుత్వం రెవెన్యూ/భూ చట్టాల సమీక్ష బాధ్యతలను కట్టబెట్టింది.


1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి రెవెన్యూ శాఖలో కీలక ముద్ర వేశారు. అత్యంత విలువైన భూములు కలిగిన రంగారెడ్డి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. యూఎల్సీ ప్రత్యేకాధికారిగా కూడా ఉన్నారు. రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌(ఆర్‌వోఆర్‌) చట్టాన్ని అనుసరించి, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చిరస్థాయిగా ఉంటాయని రెవెన్యూ అధికారులు చెబుతుంటారు. బెంగళూరులోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి పట్టభద్రుడైన శేషాద్రికి రెవెన్యూ చట్టాలపై గట్టి పట్టుంది. మితభాషిగా పేరున్న ఆయనకు సమర్థుడైన అధికారిగా పేరుంది.

Updated Date - 2020-10-01T00:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising