ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధులకు డుమ్మా కొట్టిన హెచ్‌ఎం సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2020-12-04T05:38:13+05:30

ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుని ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్న పలువురు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాక పోవడంతో ఇప్పటికే జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి పలువురు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ‘‘బడికి డుమ్మా’’ అనే వార్త కథనం ప్రచురితమైంది.

బజార్‌హత్నూర్‌లో పాఠశాల రికార్డులను పరిశీలిస్తున్న డీఈవో రవీందర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలోని పలు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

ఆదిలాబాద్‌, డిసెంబర్‌3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుని ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్న పలువురు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాక పోవడంతో ఇప్పటికే జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి పలువురు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ‘‘బడికి డుమ్మా’’ అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో మరింత అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు అకస్మిక తనిఖీలతో దూకుడు పెంచారు. గురువారం నేరడిగొండ మండలం శంకర్‌రావు పేట గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న జె.హేమాజి గత నెల 23 తేదీ నుంచి విధులకు హాజరు కావడం లేదని విధుల నుంచి సస్పెన్షన్‌ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

బజార్‌హత్నూర్‌: మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలను డీఈవో రవీందర్‌ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరు పట్టికను, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కరోనా నేపథ్యంలో  యాభైశాతం ఉపాధ్యాయులు తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులకు విధిగా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించి పాఠ్యాంశాలపై పరీక్షలను నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల ను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రాన్ని సందర్శించారు. ఇందులో ఉపాధ్యాయులు ప్రసాద్‌, బలిరాం, ప్రకాష్‌, రమేష్‌, సిందు, పుశ్పలత పాల్గొన్నారు. 

నేరడిగొండ: విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్‌ తరగతులపై ఉపాధ్యా యులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేద్రంలోని జడ్పీ పాఠశాలతోపాటు వడూర్‌, శంకరాపూర్‌ పాఠశాలలతో పాటు కస్తూర్బా బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎంఈవో భుమారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు ఉన్నారు. 

Updated Date - 2020-12-04T05:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising